అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా విడుదల ఆలస్యం

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా నా పేరు సూర్య. వక్కంతం వంశి దర్శకత్వంలో బన్నీ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానులకు బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. మొన్నామధ్య సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేసి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశారు. ఈ టీజర్ లో బన్నీ యాక్షన్ ఒక రేంజ్ లో ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ చకచక పూర్తవుతున్నాయి కనుక, చెప్పిన సమయానికి ఈ సినిమా మే 4వ తేదీన విడుదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్స్ కి రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా రష్ చూసిన అల్లు అర్జున్ .. కొన్ని సన్నివేశాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఆ సన్నివేశాలను రీ షూట్ చేయవలసిందేనని దర్శకుడితో చెప్పినట్టు సమాచారం. ఆ షెడ్యూల్ కి సంబంధించి ప్లాన్ చేస్తున్నారు. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ఈనెల 15వ తేదీన జరుపుతున్నారని మనకందరికీ తెలుసు. మరి ఆ సమయంలో సినిమా తేదీ విడుదల పై స్పష్టమైన ప్రకటన వస్తుందని అంటున్నారు సినిమా యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here