రష్యా దేశానికి వెళ్లిపోతున్న శ్రియ

రష్యన్ యువకుడిని ప్రేమించి పెళ్ళాడింది సౌతిండియా సీనియర్ హీరోయిన్ శ్రియ. దక్షిణాది సినిమా రంగంలో అన్ని ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్ గా దాదాపు అందరి అగ్ర హీరోల పక్కన నటించిన శ్రియ. ఈ మధ్యనే రష్యాకు చెందిన వ్యాపారవేత్తని పెళ్లాడింది. ప్రస్తుతం శ్రియ తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఆటా నాదే వేటా నాదే సినిమాలో వెంకీ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ప్రస్తుతం వివాహం జరగడంతో ఆ సినిమా నుండి తప్పుకుందట.
కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజగా శ్రియ రష్యాలోని కాపురం పెట్టేందుకు రెడీ అయిందట. త్వరలోనే ఆమె రష్యాకు పయనం అవుతుంది. దాంతో పాటు ఆమె కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. వాటికి కూడా కొన్నాళ్ళు బ్రేక్ ఇవ్వనుందట. మొత్తంమీద శ్రియ ఇండియాలో హీరోయిన్ గా పేరు సంపాదించి రష్యా దేశం లో భార్యగా ఉంటుందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here