డైరెక్టర్ సుకుమార్ అక్కినేని అఖిల్ తో సినిమా?

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో విభిన్న మిగతా దర్శకుల పనితీరు తో పోలిస్తే. ఆఖరికి దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా సుకుమార్ దర్శకత్వాన్నికి పెద్ద అభిమానిని చాలా సందర్భాలలో బహిరంగంగానే చెప్పారు. అయితే తాజాగా సుకుమార్ రంగస్థలం సినిమా తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు. మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ కు ఇంత పెద్ద విజయం అందించిన సుకుమార్ ప్రస్తుతం అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ తో ఓ చిత్రం చేయనున్నట్లు వినికిడి.

అయితే ఈ మేరకు వీరిద్దరు ఒకసారి కలిసారని, ఆ సమయం లో వారిద్దరి మధ్య కథాచర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ విషయం అధికారికంగా బయటికి రాలేదు కానీ ప్రస్తుతం అఖిల్ తొలిప్రేమ తో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇండస్ట్రీలో. అన్నయ్య నాగచైతన్యకి 100% లవ్ సినిమాతో మంచి విజయాన్ని ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్….మరి తమ్ముడు అఖిల్ కి ఎటువంటి విజయాన్ని ఇస్తాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here