వైసీపీ విజయాన్ని చంద్రబాబు ఆపలేరు: విజయసాయిరెడ్డి

వైసీపీ సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు పై పార్లమెంటు సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ పార్టీ విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపలేరు అని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా మోసం చేసి ప్రజలను నిలువునా దోచుకున్న చంద్రబాబుకి రాబోయే ఎన్నికలలో కచ్చితంగా ఆంధ్ర ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అయి వుండి ఢిల్లీలో చాలా చీప్ గా  ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు అని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంతగా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
పార్లమెంట్ మెట్ల వద్ద మొక్కుతూ షాట్‌ ఓకే అయిందా లేదా అని చూశారని ఎద్దేవా చేశారు. గతంలో కమ్యూనిస్టులు, పవన్‌ కల్యాణ్‌, బీజేపీలను తన సైకిల్‌కు టైర్లుగా వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు కొత్త టైర్ల కోసం ఢిల్లీలో తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. కనీసం 150 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరియు అదే విధంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పై కూడా సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here