అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ ! సాక్ష్యం ఇదే ?

పవన్ కళ్యాణ్ కి సంబంధించి నిజాయతీ , సీరియస్ గా మాట ఇస్తే వెనక్కి తీసుకునే వ్యక్తి కాదు అని మార్కెట్ లో మంచి పేరు ఉండనే ఉంది. పవన్ లో ఉండే ఈ గుణం అంటే ఇండస్ట్రీ లో మాత్రమె కాక బయట జనం , అతని సన్నిహితులు కూడా చెబుతారు అలాగే ఎప్పటికప్పుడు వారి అనుభవాలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యన ఏ ఎం రత్నం కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు అనే పుకారు గట్టిగా వినిపిస్తోంది. రత్నం కష్టాల్లోంచి గట్టు ఎక్కడానికి అని పవన్ ఒక మాట ఇచ్చాడు. అందుకోసమే సినిమా ఒకటి ఒప్పుకుని ముహూర్తం షాట్ కూడా కొట్టించాడు.

నీసన్ అనే తమిళ దర్శకుడితో పవన్ సినిమాని మొదలు పెట్టి పూజా కార్యక్రమం కూడా చేసి తమన్ ని మ్యూజిక్ కి పెట్టుకోమని సలహా కూడా ఇచ్చి ఇప్పుడు టైం లేదు అని తప్పించుకో బోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది. రత్నం ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద చాలా డబ్బు కూడా పెట్టారట. తమన్ రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తి చేసాడు. త్వరలో రాజకీయాలలోకి అడుగు పెట్ట బోతున్న పవన్ ఇలాంటి టైం లో ఈ సినిమా చేసే అవకాశం రావడం చాలా పెద్ద విశేషం అని చెప్పాలి. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆగిపోయేలా ఉన్నాయి అంటే ఈ సినిమా డౌట్ గానే ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు ఇచ్చిన భారీ ఆఫర్ ని మెచ్చిన పవన్ కళ్యాణ్ కేవలం అరవై రోజుల డేట్ ల కోసం నలభై కోట్లు పారితోషికం ఎక్స్ పెక్ట్ చేయడం వారు ఓకే అనడం తో జనసేన కి నిధులు అవసరం ఉన్న కళ్యాణ్ ఈ ఆఫర్ కి ఓకే చెప్పేసాడు అని టాక్ వినిపిస్తోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here