రాంచ‌ర‌ణ్ నిర్మాత‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా…?

మెగా ప‌వ‌ర్ స్టార్ రాం చ‌ర‌ణ్ నిర్మాత‌గా ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ఓ సినిమా వ‌స్తుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. దీన్ని డైరెక్ట్ చేయ‌బోతోంది కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్. జానీ ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్‌తో సినిమా తీయాల‌ని అనుకుంటున్నారు. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసి స్టోరీ వినిపిస్తే క‌చ్చితంగా చేద్దామ‌ని చెప్పిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా గురిచి రాం చ‌ర‌ణ్‌కి కూడా చెప్పిన‌ట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రామ్‌ చరణ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని అంటున్నారు. చరణ్‌తో జానీ మాస్టర్‌కి ఉన్న బాండింగ్‌ గురించి తెలియంది కాదు. అలాగే నాన్న చిరంజీవితోనే కాకుండా.. బాబాయ్‌ పవన్‌తో కూడా సినిమా చేస్తానని చరణ్‌ మెగాభిమానులకు మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాటని ఇప్పుడు నిజం చేయబోతున్నారని అంటున్నారు. అన్నీ కుదిరితే.. అతి త్వరలోనే అధికారికంగా ఈ చిత్ర ప్రకటన రానుందని అంటున్నారు. కాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస‌బెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన చేస్తున్న ‘వకీల్‌సాబ్‌’ చిత్ర చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఈ చిత్రం తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో, సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రాలను చేసేందుకు పవన్‌ అంగీకరించారు. ఈ చిత్రాలకు సంబంధించిన వివరాలను మేకర్స్‌ అధికారికంగా కూడా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here