పవన్ కంపోజ్ చేసిన ఆ ఫైట్ అజ్ఞాతవాసి కి హై లైట్ అవుతుందట !

హీరో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి ( వర్కింగ్ టైటిల్) సినిమా ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ లో బిజీ గా ఉంది. త్వరలో షూటింగ్ ని ఎలాగైనా పూర్తి చేసి తన జనసేన పనులు చూసుకోవాలి అనేది పవన్ ప్లాన్ కావడం తో టీం మొత్తం ఇక్కడే తిష్ట వేసారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో తన మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ ని బయట పెట్టిన పవన్ ఈమధ్య వాటిమీద అసలు దృష్టి పెట్టడమే లేదు.
పవన్ కి మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశం వుంది. అయినా ఈ సినిమా కోసం రెండు నెలల పాటు ఆయన ప్రాక్ట్రిస్ చేశాడట. ఓకే అనుకున్న తరువాత ఇటీవల షెడ్యూల్ లోనే ఈ ఫైట్ ను చిత్రీకరించినట్టు సమాచారం. ఈ ఫైట్ అద్భుతంగా వచ్చిందనీ  .. సినిమాకి ఈ ఫైట్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. థియేటర్ లో ఈ ఫైట్ కి పవన్ ఫాన్స్ సూపర్ గా కనక్ట్ అవుతారు అనీ ఖుషీ సినిమా స్టైల్ లో పవన్ స్వయంగా ఫైట్ కంపోజ్ చేసాడు అనీ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here