మహేష్ – రాజమౌళి లకి మధ్యలో అడ్డంగా ఉన్న త్రివిక్రమ్ – బోయపాటి శ్రీను !

హీరో మహేష్ బాబు – డైరెక్టర్ రాజమౌళి .. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఫాన్స్ కి అంతకంటే గొప్ప ఫెస్టివల్ ఏదైనా ఉంటుందా అసలు? స్పైడర్, బ్రహ్మోత్సవంలాంటి ప్లాపులలో ఉన్న మహేష్ ఇప్పుడు భరత్ అనే నేను తో తనని తాను ప్రూవ్ చేసుకునే దిశగా సాగుతున్నాడు. ఏప్రిల్ 27 న ఈ సినిమా విడుదల కి సిద్దం అవుతూ ఉండగా  ఆ తరువాత మహేశ్ తన 25వ సినిమా కోసం వంశీ పైడిపల్లితో సెట్స్ పైకి వెళతాడు.

ఈ సినిమా 2018 చివర్లో విడుదలవుతుంది. ఆ సమయంలోనే త్రివిక్రమ్ తో మహేశ్ మూవీ షూటింగ్ మొదలై, 2019 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఆ వెంటనే మహేష్ తో బోయపాటి ఒక సినిమా ఉంది అంటున్నారు, 2019 సంవత్సరం ఆఖర్లో ఈ సినిమా విడుదల అయితే వెంటనే రాజమౌళి తో మహేష్ సినిమా చేస్తాడు అనేది ఫిలిం నగర్ టాక్. ఇంత గ్యాప్ లో రాజమౌళి ఏం చేస్తాడు అనేది పెద్ద ప్రశ్న.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here