సాహో లో మైండ్ బ్లోయింగ్ సీన్ .. ఇరవై నిమిషాల సీన్ కోసం పాతిక కోట్లు

ప్రభాస్ తాజా చిత్రంగా రూపొందుతోన్న ‘సాహో’ గురించే అంతా మాట్లాడుకునేలా ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. యూవీ క్రియేషన్స్ వారు 150 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సినిమా చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను విడుదల కానున్న ఈ సినిమా, అబుదాబీలోను .. రొమేనియాలోను షూటింగ్ జరుపుకోనుంది.
 భారీ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో 20 నిమిషాల పాటు సాగే ఛేజ్ సీక్వెన్స్ ఒకటి ఉందట. హాలీవుడ్ తరహాలో సాగే ఈ ఛేజ్ సీక్వెన్స్ కోసం 25 కోట్లు ఖర్చు చేస్తున్నారట. గతంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ .. ‘మహానుభావుడు’ సినిమాలకి కలిపి కూడా 25 కోట్ల బడ్జెట్ దాటలేదు.
అలాంటిది ‘సాహో’లో ఒక సీన్ కోసం ఈ స్థాయి ఖర్చు చేస్తుండటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో జాకీష్రాఫ్ .. నీల్ నితిన్ ముఖేష్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here