నిర్మాతని మోసం చేసి మూడు కోట్లు నష్టం తెచ్చిన వున్నది ఒకటే హీరోయిన్ లావణ్య త్రిపాఠి !

నిజమో కాదో ఇంకా తేలాల్సి ఉంది కానీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కి సంబంధించి ఇంటర్నెట్ లో ఒక పుకారు హల్చల్ చేస్తోంది. 100% లవ్ అనే తమిళ చిత్రం కోసం సంతకం పెట్టిన ఆమె షూటింగ్ మధ్యలోంచి నిర్మాతలని మోసం చేసి వెళ్ళిపోయింది అనీ దాదాపు నాలుగు కోట్ల వరకూ ఆమె ఈ విషయంలో ప్రొడ్యూసర్ లకి నష్టం తెచ్చింది అనీ అంటున్నారు.

ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వలన తాము నష్టపోయామనీ, నష్ట పరిహారంగా 3 కోట్లు ఇప్పించమని నిర్మాతలు అక్కడి కౌన్సిల్ ను ఆశ్రయించారు. కౌన్సిల్ నిర్ణయం నిర్మాతలకి అనుకూలంగా వుండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరొక పక్క లావణ్య మాత్రం అలాంటిది ఏమీ లేదు అనీ ఇదంతా గాసిప్ అనీ అంటోంది, రేపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి లావణ్య మీద చర్యలకి నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. వున్నది ఒకటే జిందగీ లో హీరోయిన్ గ చేసిన లావణ్య గ్లామర్ పాత్రలో ఆదరగోట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here