ఎన్టీఆర్ ని అలా చూపించాలి అని త్రివిక్రమ్ తాపత్రయం .. గడ్డం గీకేయమన్నాడు !

ఒకప్పుడు మూస లుక్స్ తో కనపడిన హీరో తారక్ టెంపర్ సినిమా దగ్గర నుంచీ సూపర్ పాష్ గా తయారు అయ్యాడు. నన్ను ప్రేమతో లో గడ్డం పెంచి ఫుల్ క్లాసీగా ఆనిన మనోడు ఆ తరవాత జనతా గ్యారేజ్ సినిమా టైం లో కూడా బాగున్నాడు. జై లవ కుశ లో మూడు పాత్రలలో ఒకేసారి కనపడిన ఎన్టీఆర్ డిఫరెంట్ లూక్స్ పెట్టకుండా నే హావభావాలతో రక్తి కట్టించాడు.

ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా విషయం లో మాత్రం పూర్తిగా షేవ్ చేసుకుని క్లాస్ లుక్ తో కనిపించనున్నట్టు సమాచారం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కనుక .. ఆ లుక్ తో ఉండాలని త్రివిక్రమ్ చెప్పారట. అందువలన ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి భిన్నంగా కనిపించనున్నాడని అంటున్నారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని కెరీర్ లో ఎవరూ చూపించనంత స్టైల్ గా చూపించాలని తాపత్రయ పడుతున్నాడట.

అల్లూ అర్జున్ , పవన్ కళ్యాణ్ లని స్టైలిస్ట్ లు గా మార్చిన త్రివీ తమ హీరో తో ఏం ప్రయోగం చేస్తాడో అంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. మొత్తం మీద గడ్డం అయితే ఇక ఎన్టీఆర్ కి ఉండనట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here