ప్ర‌యాణీకుడికి గుండెపోటు.. విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌..

అప్పుడే గాల్లోకి ఎగిరిన విమానం ఉన్న‌ట్టుండి అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ అయ్యింది. ఓ ప్ర‌యాణీకుడికి అక‌స్మాత్తుగా గుండెపోటు రావ‌డంతో విమానాన్నికింద‌కు దింపాల్సి వ‌చ్చింది. అధికారులు ఎంత చాక‌చ‌క్యంగా నిర్ణ‌యం తీసుకున్నా అత‌ని ప్రాణాలు కాపాడ‌లేక‌పోయారు.

రియాద్ నుంచి ఢిల్లీ వస్తున్న గో ఎయిర్ విమానం మెడికల్ ఎమర్జెన్సీతో కరాచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. రియాద్ నగరం నుంచి జి 8-6658 ఎ అనే గో ఎయిర్ విమానం ప్రయాణికులతో బయలుదేరాక విమానంలోని 30 ఏళ్ల ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో అత్యవసర వైద్యం చేయించేందుకు వీలుగా విమానాన్ని కరాచీ నగరంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. గుండె పోటు వచ్చిన విమాన ప్రయాణికుడు మరణించాడు.

దీంతో కరాచీ నుంచి గో ఎయిర్ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ల‌నుంది. దీంతో విమాన‌ప్ర‌యాణంలో విషాదం నెల‌కొంద‌ని చెప్పొచ్చు. ఉన్న‌ట్టుండి ఓ ప్ర‌యాణీకుడు మ‌ర‌ణించ‌డంతో అక్క‌డున్న వారంతా విచారం వ్య‌క్తం చేశారు. విమానంలో ఉన్న అధికారులు స‌కాలంలో స్పందించినా ఇలా జ‌రిగిపోయింద‌ని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here