భార‌త్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పాకిస్తాన్‌..

స‌రిహ‌ద్దులో పాకిస్తాన్ ఎలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోందో అంద‌రికీ తెలిసిందే. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని త‌ర‌చూ ఉల్లంఘిస్తూ ఉండే పాకిస్తాన్ తాజాగా భార‌త్‌పై ఆరోప‌ణ‌లు చేసింది. ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్‌లోని సీనియర్ దౌత్యవేత్తను పిలిచి మరీ గురువారం నిరసన తెలిపింది.

జ‌మ్ముక‌శ్మీర్ స‌రిహ‌ద్దులో పాక్ ఎలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుందో త‌ర‌చూ మ‌నం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు పాక్ భార‌త్‌పై రివ‌ర్స్‌లో మాట‌ల దాడి చేయ‌డనికి సిద్ధ‌మైంది. భారత దేశంపై అక్కసుతో జమ్మూ-కశ్మీరు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్నదే పాకిస్థాన్ అని అందరికీ తెలిసిందే. అలాంటి దేశం తరచూ భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ ఉంటుంది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత నెలలో ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరంలో సుమారు 3,800 కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాకిస్థాన్ పాల్పడింది. పాకిస్థాన్ దళాలు మన దేశంలోని సామాన్య ప్రజల నివాసాలపై కూడా కాల్పులు జరుపుతుండటం శోచనీయం.

తాజాగా పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. భారత భద్రతా దళాలు రాఖ్‌చిక్రి సెక్టర్‌లో బుధవారం విచక్షణారహితంగా, హెచ్చరికలు లేకుండా జరిపిన కాల్పుల వల్ల ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు ఆరోపించింది. 2003నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని భారత దేశాన్ని కోరినట్లు తెలిపింది. ఎల్ఓసీ వెంబడి జరుగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై దర్యాప్తు జరపాలని కోరినట్లు పేర్కొంది. ఎల్ఓసీ, వర్కింగ్ బౌండరీల వద్ద శాంతిని కాపాడేందుకు కృషి చేయాలని కోరినట్లు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here