బాలీవుడ్ న‌టుడు ఆత్మ‌హ‌త్య..

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ఆసీఫ్ బ‌స్త్రా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకొని ఆయ‌న చ‌నిపోయాడు. ఈయ‌న ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న బ‌య‌ట‌కు తెలియ‌డంతో ఒక్క‌సారిగా బాలీవుడ్ దిగ్బ్రాంతికి గురైంది. ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌ను ఇండ‌స్ట్రీ జీర్ణించుకోలేక‌పోతోంది.

ఆసీఫ్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ధ‌ర్మ‌శాల‌లో ఓ అపార్ట్‌మెంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆయ‌న ఐదు సంవ‌త్స‌రాలుగా అక్క‌డే ఉంటున్నారు. ఆసీఫ్ సినిమాల‌తో పాటు బుల్లితెర‌లో కూడా అంద‌రికీ తెలిసిన వ్య‌క్తి. అయితే ఆయ‌న ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకున్నార‌న్న దానిపై ఎలాంటి వివ‌రాలు తెలియ‌లేదు. కాగా ఆయ‌న ఆత్మ‌హ‌త్య విష‌యం తెలుసుకున్న ప‌లువురు ప్ర‌ముఖులు అంద‌రూ తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ హ‌స్స‌ల్ మెహ‌తా ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ఇది చేదు వార్త‌. ఇది నిజం కాకూడ‌ద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. న‌మ్మ‌శ‌క్యం కావ‌డం లేద‌ని.. లాక్ డౌన్‌కి ముందే ఆయ‌న్ను క‌లిశాన‌ని న‌టుడు మ‌నోజ్ బాజ్‌పేయి అన్నారు. ఇండ‌స్ట్రీలో న‌టులు ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ప‌ట్ల సినీ అభిమానులు సైతం ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here