బిగ్‌బాస్‌కు నాగ‌చైత‌న్య రావ‌డంపై క్లారిటీ ఉందా..

బిగ్‌బాస్ 4 మంచి క్రేజ్‌లో ఉంది. కంటెస్టెంట్లు చేస్తున్న హ‌డావిడికి మొద‌ట్లో ఈ షో రేటింగ్‌లో టాప్ ప్లేస్‌కి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఈ సారి క‌రోనా కార‌ణంగా కొత్త సినిమాలు ఏవీ లేక‌పోవ‌డంతో హీరోలు, హీరోయిన్ల సంద‌డి ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు.

అయితే దసరా సందర్భంగా మాత్రం కొందరు గెస్ట్‌లను తీసుకొచ్చి హడావుడి చేయించారు. గత వారం యాంకర్ సుమను తీసుకొచ్చారు. ఈ వీకెండ్‌లో దీపావళికి కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బిగ్‌బాస్ వేదికపై అక్కినేని కుటుంబం నుంచి సమంత, అఖిల్ సందడి చేశారు. ఈ దీపావళి ఎపిసోడ్‌లో నాగచైతన్య కనిపించబోతున్నాడని అంటున్నారు. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ వీకెండ్ ఎపిసోడ్‌కు నాగ్ వస్తారా రారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కరోనా నెగిటివ్ రావడంతో నాగార్జునే ఈ వీకెండ్‌ను హోస్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ వీకెండ్‌లో నాగ్‌తోపాటు నాగచైతన్య కూడా సందడిచేయబోతున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here