భార‌త్ కంటే పాకిస్తాన్ బెట‌ర్ అంటున్నారు..

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మోదీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. క‌రోనాను అరిక‌ట్టే విష‌యంలో ప్ర‌భుత్వాన్ని ఆయ‌న ఎద్దేవా చేశారు. కరోనాను అరికట్టే విషయంలో భారత్ కంటే పాక్, ఆఫ్గనిస్తాన్‌లే నయమని ట్విట్టర్ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు.

ఇటీవ‌ల మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ త‌న‌దైన శైలిలో విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కరోనాతో పాటు జీడీపీని ఉద్దేశిస్తే వ్యాఖ్య‌లు చేశారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో ఘనమైన విజయాన్ని సాధించిందంటూ రాహుల్ విమర్శించారు. ఈ మేరకు మన పొరుగు దేశాల జీడీపీలను, మన దేశ జీడీపీని పోలుస్తూ రాహుల్ గ్రాఫ్‌ను షేర్ చేశారు. కోవిడ్ 19 కారణంగా క్షీణించిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రభుత్వ వ్యయాలు పెంచడం, పన్ను ఆదాయాల క్షీణత కారణంగా ఈ ఏడాది అది 17 శాతం పెరిగి, జీడీపీలో 90 శాతానికి చేరవచ్చునని అధ్యయనంలో తేలిందని ఐఎంఎఫ్ పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే రాహుల్ కేంద్రంపై విమర్శలు చేశారు. కరోనా కారణంగా ఈ ఏడాది భారత ప్రభుత్వ రుణ భారం 17 శాతం పెరిగి జీడీపీలో 90 శాతానికి చేరవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. 1991 నుంచి ఇప్పటి వరకు భారత రుణభారం జీడీపీలో 70 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కాగా భారత దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,381 కరోనా కేసులు నమోదు కాగా.. 895 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసులు 73,70,469కి చేరాయి. ఇప్పటి వరకు 1.12 లక్షల మంది మరణించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here