‘అన్నపూర్ణ’లో అంతా బాగానే ఉంది.. వాటిని నమ్మకండి!

ఈరోజు ఉదయం లేవగానే సోషల్‌ మీడియాతో పాటు కొన్ని వెబ్‌సైట్లలో అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం కూడా జరిగిందని యాజమాన్యం ఈ విషయాన్ని రానివ్వడం లేదంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజంలేదని ఖండించింది అన్నపూర్ణ స్టూడియోస్‌.

ట్విట్టర్‌ వేదికగా ఈ విషయంలో స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ‘అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంతా బాగానే ఉంది.. అసలు కన్ఫర్మ్‌ కానీ వార్తలు ఎవరు నమ్మొద్దు అంటూ’ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే స్టూడియోలోని ఓ చిన్న భాగంలో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ప్రమాదానికి సంబంధించి నటుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌ అధినేత నాగార్జున కూడా స్పందించారు. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘ఈరోజు ఉదయం నుంచి మీడియాలో అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఎలాంటి భయాందోళనలు అవసరంలేదు. అది తప్పుడు వార్త.. స్టూడియోలో అంతా బాగానే ఉంది’ అని నాగ్‌ ట్వీట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here