జ‌మ్మూ, క‌శ్శీర్, ల‌ఢ‌క్ మావే.. పాకిస్తాన్‌

ఎప్పుడూ వివాదాల‌కు కేంద్ర బిందువుగా ఉండే పాకిస్థాన్ తాజాగా వివాదాస్ప‌ద‌మైన రీతిలో త‌మ భూ భాగాల‌ను ప్ర‌ద‌ర్శించింది. కొత్త మ్యాప్‌ను పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఆవిష్క‌రించారు. ఇందులో భార‌త్ భూభాగాలు చేర్చారు.

జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక అధికారాలు క‌ట్ట‌బెట్టే ఆర్టిక‌ల్ 370 ను భార‌త్ ర‌ద్దు చేసి సంవ‌త్స‌ర అవుతున్న నేప‌థ్యంలో పాకిస్థాన్ త‌న మ్యాప్‌ను విడుద‌ల చేసింది. ఇందులో జ‌మ్ముక‌శ్మీర్, ల‌ఢ‌క్ ప్రాంతాల‌ను త‌మ భూభాగంలో ఉన్న‌ట్లు పాక్ చూపించింది. కొత్త మ్యాప్‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాన‌మంత్రి ఇది పాకిస్థాన్, క‌శ్మీర్ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అద్దం ప‌డుతోంద‌న్నారు.

అయితే ఇదివ‌ర‌కు ఎప్పుడూ పాక్ ఇలా చేయ‌లేదు. గిల్గిట్‌, బాల్టిస్తాన్‌ను త‌మ మ్యాప్‌లో చూపిస్తున్న పాక్‌.. మిగిలిన ప్రాంతాన్ని ఆజాద్ క‌శ్మీర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా క‌శ్మీర్‌ను త‌మ భూభాగంలో పాక్ చూపించి త‌న వ‌క్ర బుధ్దిని చాటుకుంది. గ‌తంలో నేపాల్ కూడా ఇండియా భూభాగాన్ని త‌న మ్యాప్‌లో చూపించింది. అయితే అంత‌ర్జాతీయంగా వ‌చ్చిన ఒత్తిళ్ల మేర‌కు ఈ చ‌ర్య‌ల‌పై వెన‌క్కు త‌గ్గింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here