అయోధ్యలో పీఎం మోడీ చేతుల మీదుగా రామ మందిర భూమిపూజ

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో అయోధ్య చేరుకున్నారు. లక్నో విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్‌లో అయోధ్య చేరుకున్న ఆయనకు కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉన్నత అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి సుప్రసిద్ధ హనుమన్‌ ఆలయానికి ఆయన వెళ్లారు. హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేకంగా హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక్కరే ఉన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వీరిద్దరూ ఆలయంలో కలియ తిరిగారు. దాదాపు 5 నిమిషాల పాటు అక్కడ గడిపారు. అక్కడి నుంచి రామజన్మ భూమికి పయనమయ్యారు.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమా భారతి.. అయోధ్యలో రామజన్మభూమికి చేరుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను స్వయంగాపర్యవేక్షిస్తున్నారు. హిందూ మత పెద్దలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యోగా గురువు బాబా రాందేవ్‌, స్వామి అవదేశానంద్‌ గిరి, చిదానంద్‌ మహరాజ్‌ తదితరులు రామజన్మభూమికి విచ్చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here