మూడు కోట్ల వ్యూస్ దాటేసిన “ఢీ ఛాంపియన్స్” డాన్స్ షో

మన టెలివిజన్ హిస్టరీ లోనే ఒక డాన్స్ రియాలిటీ షో వరుసగా 12 సీజన్లు విజయవంతం అయ్యి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 11 సీజన్లను పూర్తి చేసి ఇప్పుడు 12వ సీజన్ ను కొనసాగిస్తోంది. స్టేజ్ దద్దరిల్లే డాన్స్ స్టెప్పులు కడుపుబ్బా నవ్వే ఎంటర్టైన్మెంట్ తో కొనసాగే ఈ షోకు సంబంధించి ఈరోజు ఆగస్ట్ 5 ఎపిసోడ్ ను మాత్రం మిస్సవ్వకూడదని చెప్పాలి.

ఈ రోజున టెలికాస్ట్ అవ్వనున్న ఎపిసోడ్ ప్రోమో కనీ వినీ ఎరుగని రేంజ్ లో 25 మిలియన్ వ్యూస్ అందుకొని రికార్డ్ సెట్ చేసింది. ఇది ఒక్క ఢీ ప్రోమోల హిస్టరీ లోనే కాకుండా ఏ ఇతర తెలుగు ఎంటర్టైనింగ్ ఛానెల్స్ ప్రోమోలలో కూడా లేదు. ప్రస్తుతం “ఈటీవీ ఢీ”  షో 2 లక్షలకు పైగా లైక్స్ మరియు ఇంకా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ మొత్తం మూడు కోట్ల వరకు వ్యూస్ ను కొల్లగొట్టాయి.

ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో పండు పెరఫార్మన్స్ మెయిన్ హైలైట్ గా నిలవనుంది అలాగే సోము చేసిన ఎమోషనల్ పెరఫార్మన్స్ మరియు సుధీర్ అండ్ రష్మిల మధ్య చేసిన బుట్ట బొమ్మ సాంగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి యూట్యూబ్ లో ఇంత రచ్చ లేపిన ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఈటీవీలో ప్రసారం కానుంది. మనం కూడా చూసి ఎంటర్టైన్ అవుదామా మరి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here