ప్ర‌ధాని మోదీపై ఆయ‌న ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడారు…?

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి. చిదంబ‌రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. న‌మ‌స్తే ట్రంప్ అంటూ మ‌రోసారి ట్రంప్‌ను పిలుస్తారా అని ఆయ‌న మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ మ‌రోసారి మోదీపై వ్యంగాస్త్రాలు సంధించిన‌ట్లైంది.

అమెరికా ఎన్నిక‌ల చ‌ర్చ‌ల్లో భాగంగా  అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ క‌రోనా కేసుల విష‌యంలో భార‌త్‌పై ఇష్టానుసారంగా మాట్లాడిన విష‌యం తెలిసిందే. ర‌ష్యా, చైనాతో పాటు భార‌త్ వంటి దేశాలు క‌రోనా కేసుల మ‌ర‌ణాల‌ను బ‌య‌ట పెట్ట‌వ‌ని ట్రంప్ వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. భార‌త్‌లో క‌రోనా కేసుల గురించి వివ‌రాలు దాచిపెట్టాల్సిన అవ‌స‌రం ఏముందని ప‌బ్లిక్ చ‌ర్చించుకుంటున్నారు.  వారి దేశంలో ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకు ట్రంప్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం క‌రెక్టు కాద‌ని అంటున్నారు.

కాగా విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంది. ట్రంప్ ఇలా వ్యాఖ్య‌లు చేశార‌ని చెబుతూ ఆ పార్టీ నేత‌, మాజీ మంత్రి పి. చిదంబ‌రం మోదీని ఉద్దేశించి సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నించారు.  ప్రధాని మోదీని మరోసారి నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా.. ఆయన డియర్ ఫ్రెండ్  ట్రంప్ ని మరోసారి ఆహ్వానిస్తారా.. అంటూ చిదంబరం ఎద్దేవా చేశారు. ఇది సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఫుల్‌గా చ‌క్క‌ర్లు కొడుతోంది. ఏదిఏమైనా ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ నేత‌లు వ్యంగాస్త్రాలు సంధించ‌డంలో ముందంజ‌లో ఉన్నారని అర్థ‌మవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here