ఆ విషయంలో అలా కుదరదు…

కరోనా కారణంగా దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రo హోమ్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. మునుపెన్నడు ఈ విధానాన్ని పాటించని కంపెనీలు కూడా కరోనా దెబ్బకి ఈ బాట పట్టాల్సి వచ్చింది. అయితే తమ పని మాత్రం ఇంటి నుంచి చేసేది కాదని చెబుతున్నాడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ఇంట్లో కూర్చుని పాటకు సంగీతాన్ని సమకూర్చడం అంత సులువైన పని కాదని చెబుతున్నాడు.

ఈ విషయమై అనూప్  మాట్లాడుతూ..  ‘ లాక్ డౌన్ లో పని చేశాను. కానీ ఎక్కడో అసంతృప్తి ఉంది. దర్శకుడు,  నిర్మాత అందరూ కలిసి కూర్చుని ఏది బాగుంటుందో చర్చించుకొని.. మ్యూజిక్ అందిస్తే బాగుంటుంది. కానీ ఇలా ఇంట్లో ఒక్కడినే కూర్చొని పాటలకు బాణీలు కట్టడం కష్టంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఒరేయ్ బుజ్జి చిత్రం గురువారం ఓటీటీలో విడుదలకానుంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here