మెగాఫోన్ పట్టనున్న మోహన్ బాబు..?

హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి అగ్రహీరోల సరసన ఒకరి గా ఓ వెలుగు వెలిగారు. ఇక ప్రస్తుతం అడపాదడపాగా l సినిమాల్లో నటిస్తోన్న మోహన్ బాబు దర్శకుడిగా కూడా మారనున్నాడని తెలుస్తోంది.

తాజాగా మోహన్ బాబు నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక దీని తర్వాత సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో నటించనున్నారు. ఇదిలా ఉంటే సినిమా పూర్తయ్యాక.. మోహన్ బాబు మెగాఫోన్ పట్టనున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ చిత్రంలో హీరోగా ఆయన కుటుంబానికి చెందిన హీరోనే నటిస్తారా.? నిర్మాతగా ఎవరు వ్యవహరిస్తారనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇన్నేళ్ల కెరీర్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన మోహన్ బాబు.. దర్శకత్వం వైపు నిజంగానే అడుగులు వేస్తారా.? వేస్తే.. ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here