కోటి మందికి క‌రోనా వ‌చ్చిందే తెలియ‌దు.. ఆశాజ‌న‌కంగా ప‌రిస్థితులు..

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొసాగుతూనే ఉంది. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఇక ఏపీలో ఇప్ప‌టికే 5 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు నమోదైతే.. కోటి మందికి క‌రోనా వ‌చ్చి వెళ్లిపోయినట్లు నివేదిక‌లు చెబుతున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా టెస్టులు చేయ‌డం ఎక్కువ‌గా ఉంది. మొద‌ట్లో ఇది నెమ్మ‌దించినా త‌ర్వాత టెస్టుల సంఖ్య‌ను పెంచుకుంటూ పోయారు. దీని ద్వారా ట్రీట్‌మెంట్ చేసి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఉద్దేశం. అనుకున్న‌ట్లుగానే టెస్టులు చేయ‌డంలో ఏపీ దూసుకుపోయింది. ఫ‌లితంగానే ఇప్ప‌టికీ ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5 ల‌క్ష‌ల 30 వేలు దాటింది. అయితే వీరిలో రిక‌వరీ అయిన వారు 4 ల‌క్ష‌ల‌కు పైగానే ఉన్నారు.

ఏపీలో రిక‌వ‌రీ రేటు 80 శాతానికి పైగానే ఉంది. కాగా ఇటీవ‌ల నిర్వ‌హించిన సీరో స‌ర్వేలో రాష్ట్రంలో 20 శాతానికి పైగా అంటే కోటి మందికి క‌రోనా వ‌చ్చి వెళ్లిపోయినట్లు చెప్పారు. వారిలో ఉన్న ఇమ్యూనిటీ ప‌వ‌ర్ కావొచ్చు, త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల కావ‌చ్చు వీరంద‌రిపై క‌రోనా ప్ర‌భావం చూప‌లేక‌పోయింద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని చెప్పొచ్చు. మొన్న‌టి వ‌ర‌కు వంద‌లో 17 పాజిటివ్ కేసులు వ‌స్తే.. ఇప్పుడు 14 పాజిటివ్ కేసులు న‌మోదవుతుండ‌టమే ఇందుకు నిద‌ర్శ‌నం. రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌ను ప‌క‌డ్బంధీగా చేప‌డుతోంది. సీఎం జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనాపై స‌మీక్ష‌లు చేస్తూనే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here