మరోసారి తండ్రి అవుతున్న ఎన్టీఆర్!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకసారి తండ్రి అవబోతున్నాడు అని సమాచారం. ఎన్టీఆర్ ప్రణతి ల జంటకి  ఇండస్ట్రీ లో మంచి పేరు ఉంది. ఇప్పటికే వీరిద్దరికీ అభ‌య్ రామ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇటీవల జరిగిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి కూడా అభ‌య్ రామ్ కూడా వచ్చాడు. అంతేకాకుండా అభ‌య్ రామ్ సోషల్ మీడియాలో తండ్రి ఎన్టీఆర్ తో దిగిన ఫోటో లతో హల్ చల్ చేస్తు చాలా సార్లు కనిపించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ ఫ్యామిలీలోకి మ‌రో బుజ్జి పాపాయి అడుగు పెట్ట‌బోతోందిట‌.
పాప‌నా? లేక బాబా? అన్న‌ది త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ తెలియ‌జేస్తారుట. వాస్త‌వానికి ఈ సంగ‌తిని దాచేందుకు ప్ర‌య‌త్నించినా, స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా లీకైపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో  సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాలో స్లిమ్ గా కనబడటం కోసం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తూ జిమ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.ఈ సినిమా షూటింగ్ మార్చి నెలాఖరు నుండి స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ సందర్భంగా నందమూరి ఫ్యామిలీ లోకి మరో ఎంట్రీ అవుతుండడం ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్తే అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here