బిగ్ బాస్ సీజన్-2 కి హోస్ట్ గా అల్లు అర్జున్?

తెలుగు బిగ్ బాస్ షో స్టార్ మా లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమం అని చెప్పవచ్చు . ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పని చేసిన ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఎంతో పాపులర్ అయిన ఈ షో….రెండవ సీజన్ కు రెడీ గా ఉంది. ఈ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలన కరమైన వార్త కనపడుతుంది అదేమిటంటే ఈ షోకు హోస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్  ఎన్నికైనట్టు తెలుస్తుంది. అసలు మొదటగా మొదటి సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించిన తారక్ నే ఈ సీజన్ కి కూడా మా ఎంచుకుంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ రాజమౌళి సినిమాలకు కమిట్మెంట్ అయినా నేపథ్యంలో ఎన్టీఆర్ రెండవ సీజన్లో హోస్ట్ గా చేయలేనని చెప్పినట్లు సమాచారం అందుతోంది.ఆయన స్థానంలో బన్నీ అయితే బాగుంటాడని, ప్రస్తుతం నా పేరు సూర్య తరువాత తన తదుపరి చిత్రం ఇంతవరకు ప్రకటించని బన్నీకి కొంత గ్యాప్ ఉందని తెలుస్తోంది. అదీ కాక తారక్ లో ఉన్నంత ఈజ్ బన్నీలోను ఉంటుందని మా బృందంకూడా ఆయనకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వార్త ఏదీ కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here