జనసేన టికెట్ ఇప్పించండి డబ్బులు వద్దు : అజ్ఞాతవాసి డిస్ట్రిబ్యూటర్

భారతీయ చలనచిత్ర రంగ చరిత్రలో సినిమాను పంపిణీ చేసిన పంపిణీదారులకు అతి భారీ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలలో అజ్ఞాతవాసి సినిమా మూడవ స్థానం దక్కించుకుంది దేశంలో. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ దగ్గర విడుదలవడం జరిగింది.
అయితే ఈ క్రమంలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ నేపథ్యంలో డిస్టిబ్యూటర్లు సినిమాకు డబ్బులు ఎక్కువ మొత్తం చెల్లించి కొనడం జరిగింది. ఆఖరికి  సినిమా రిలీజయ్యాక సినిమా మొదటి షో నుండి ఫ్లాప్ టాక్ రావడంతో సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లూ భారీ నష్టాలు చూశారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూట‌ర్లు ల‌బోదిబోమ‌నే పరిస్థితి నెల‌కొన‌డంతో, చిత్ర నిర్మాత రాధాకృష్ణ కొంత మొత్తం తిరిగి వెన‌క్కి ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చార‌ని ప్ర‌చారం సాగింది.
ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన ఓ ప్ర‌ముఖ పంపిణీదారుడు త‌న‌కి వ‌చ్చిన న‌ష్టానికి బ‌దులుగా క్యాష్ తిరిగి ఇచ్చే కంటే జ‌న‌సేన పార్టీ టిక్కెట్టు ఇప్పించాల్సిందిగా రాధాకృష్ణ‌ను కోరాడ‌ట‌. దీంతో అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణ జనసేన పార్టీ వర్గాలతో అలాగే పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ తో చర్చించి సదరు పంపిణీదారుడి కి టికెట్ ఒప్పించే పనిలో పడ్డారు నిర్మాత రాధాకృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here