వాడి పొగరు ఎగిరే జెండా..!

ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ‘రామరాజు ఫర్‌ భీమ్’ పేరుతో విడుదల ఈ చేసిన వీడియో క్షణాల్లో దావలంగా వ్యాపిస్తోంది. ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే లక్షల వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ దిశగా దూసుకెళుతోంది.

ఇక ఈ టీజర్‌ విషయానికొస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను రాజమౌళి అత్యద్భుతంగా తీర్చదిద్దాడు. ఇందుకోసం ఎన్టీఆర్‌ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశాడు. కొమురం భీమ్‌ పాత్రను పరిచయం చేసే క్రమంలో రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఆకట్టుకుంటోంది. చెర్రీ చెప్పే.. ‘వాడు తడబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే.. సామ్రాజ్యాలు సాగిల పడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూతల్లి చను పాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు.. గోండు బొబ్బిలి కొమురం భీమ్‌’ డైలాగ్‌ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీడియో ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ను నింపింది. ఇక టీజర్‌ చివరిలో ఎన్టీఆర్‌ తలకు ముస్లిం క్యాప్‌ ధరించడం ఆసక్తికరంగా ఉంది. కొమురం భీంను ముస్లింలా చూపించడానికి గల కారణమేంటో తెలియాలి.

ఇక ఈ సినిమాకు నిజ జీవితాలకు ఎలాంటి సంబంధం లేదని.. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతరామరాజు, తెలంగాణలోని కొమురం భీమ్‌ అనుకోకుండా కలిసి.. ఒక కారణం కోసం పోరాటం చేస్తే ఎలా ఉంటదనే ఫిక్షన్‌ కథాంశంతో రాజమౌళి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద‌ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here