త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ ?

ఈ సంవత్సరం తెలుగు సినిమా రంగంలో తెరకెక్కబోయే అత్యంత ప్రముఖ చిత్రాలలో  ఒకటి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది సినిమా యూనిట్. అయితే ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎన్నికైనట్లు తెలుస్తుంది. టాలీవుడ్ అందాల భామలలో ఒక్కరైనా పూజా హెగ్డే ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన నటిస్తోంది.
‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో  తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన పూజా హెగ్డే  పై కుర్రకారులో  కూడా మంచి క్రేజ్ వుంది. ఈ సినిమా యూనిట్ త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడిచేయనున్నట్టు సమాచారం. హారిక అండ్ హాసిని సంస్థ వారు, ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మార్చి రెండవ వారంలో ఆరంభించనున్నారు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీవ్రంగా ఇష్టపడుతున్నారు జిమ్ లో. ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here