ముగ్గురు డైరెక్టర్ ల మధ్యలో నలిగి పోతున్న రేజీనా :

సరైన హిట్టు సినిమా లేక హీరోయిన్ రేజీనా చాలా డీలా పడిపోయింది పాపం. చేసిన ప్రతీ సినిమా ఆమెకి ఫెయిల్ అవుతూ ఉంటె ఆమె కెరీర్ మీద ఆమెకే నమ్మకం లేని పరిస్థితి. పెద్ద పెద్ద సినిమాలలో పెద్ద హీరోలతో ఛాన్స్ లేకపోయినా రేజీనా చిన్న సినిమా లు అయినా పర్లేదు అంటూ కథ నడిపిస్తోంది. తన తలరాత ని మార్చే చిత్రం కోసం రేజీనా విపరీతంగా ఎదురు చూస్తోంది . సెల్వరాఘవన్ డైరెక్షన్ లో ఆమె చేస్తోన్న తమిళ చిత్రం నెంజం మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ డైరెక్టర్ కి ఉన్న కమిట్మెంట్ బట్టీ చూస్తే ఆమెకి హిట్ వస్తుంది అని గట్టిగా నమ్ముతోంది ఆమె.

గౌతం మీనన్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వడం రేజీనా కి ఇంకా సంతోషకర విషయం. ఎస్ జే సూర్య డైరెక్షన్ లో మరొక సినిమాలో నటిస్తోంది రేజీనా ఈ సినిమా విడుదల లేట్ అవుతూ ఉండడం ఆమెకి చిరాకు కలిగిస్తోంది. మొత్తం మీద ముగ్గు డైరెక్టర్ ల మధ్యలో నలిగిపోతున్న రేజీనా త్వరలో హిట్ కోసం దేవుడిని ప్రార్ధిస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here