రాజమౌళి తో సినిమా కోసం సూపర్ ప్లాన్ వేసిన ఎన్టీఆర్ .. వర్క్ అయితే రాబోయే సినిమా ఇండియా కే అద్భుతం

ఇండియా లోనే నెంబర్ 1 డైరెక్టర్ అయిన రాజమౌళి కి పర్సనల్ గా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్యనా చాలా స్ట్రాంగ్ బంధం ఉంది. ఎన్టీఆర్ తో ఇప్పటికే మూడు సినిమాలు చేసిన మౌళి నాల్గవ సినిమా చెయ్యాలి అనే కోరిక కూడా ఉన్నట్టు ఎప్పుడో చెప్పారు. అయితే రాజమౌళి రేంజ్ ఇప్పుడు బాహుబలి తరవాత ఎక్కడికో వెళ్ళిపోయింది. బాహుబలి లాంటి సినిమా తరవాత మౌళి ఏ చిత్రం చెయ్యాలి అనేది ఇంకా డిసైడ్ కూడా అవ్వలేదు. అయితే ఎన్టీఆర్ తో ఇంకొక చిత్రం చేయడానికి మౌళి కి ఇదే రైట్‌ టైమ్‌ అని ఎన్టీఆర్‌ భావిస్తున్నాడు.

ఇప్పుడు గనక జక్కన్న మిస్ అయితే మళ్ళీ తనకి దొరకడు అనేది ఎన్టీఆర్ ప్లాన్. దానయ్య కి ఇప్పటికే కమిట్మెంట్ ఇచ్చిన మౌళి వాళ్ళ బ్యానర్ లో సినిమా చెయ్యాల్సి ఉంది. సో రాజమౌళి ని అడగకుండా నిర్మాత వైపు నుంచి ట్రై చేస్తున్నాడు ఎన్టీఆర్. దానయ్య దగ్గర తన డేట్స్‌ వుండడం ఎన్టీఆర్‌కి అనుకూలించే అంశం. ఇక ఇటు రాజమౌళి సన్నిహితులతో పాటు తన వర్గం మొత్తాన్ని కూడా ఎన్టీఆర్‌ వాడేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here