కాబోయే చిరంజీవి .. అల్లూ అర్జున్ , సాక్ష్యం ఇదే , తిరుగులేదు బన్నీ కి ఎవ్వరూ ఆపలేరు :

దువ్వాడ జగన్నాథం ఆడియో వేడుక లో అల్లూ అర్జున్ ని హరీష్ శంకర్ పొగిడిన తీరు ఇప్పుడు అందరి నోళ్ళ లో డిస్కషన్ గా మారింది. అర్జునుడితో పోల్చేసి అతనికి పక్షి కన్ని కనపడినట్టు అల్లూ అర్జున్ కి సక్సెస్ మాత్రమె టార్గెట్ కింద కనిపిస్తుంది అంటూ చాలా పోగిడేసాడు. డైరెక్టర్ నుంచి మాగ్జిమం లాక్కునే హీరోగా బన్నీ ని వర్ణించిన హరీష్ బిస్కెట్ లు వెయ్యడానికి కొత్త డైరెక్టర్ ఏమీ కాదు. రవితేజ, పవన్‌కళ్యాణ్‌, ఎన్టీఆర్‌లాంటి బడా హీరోలతో చేసిన దర్శకుడి నుంచి వచ్చిన ఈ మాటని తేలిగ్గా తీసుకోవడానికి లేదు.

క్లైమాక్స్ విషయం లో కూడా అల్లూ అర్జున్ చెప్పిన మాటలు తనకి ఉపయోగపడ్డాయి అని చెప్పుకొచ్చిన హరీష్ శంకర్ ఎంటర్టైన్మెంట్ తో క్లైమాక్స్ ని నింపేసాము అని చెప్పుకొచ్చాడు. కథ, సీన్ ల నిడివి , క్లైమాక్స్ ఇలా అన్నింటా డైరెక్టర్ తో సమానంగా ఇంటర్ ఫియర్ అవ్వడం చూస్తుంటే అల్లూ అర్జున్ అప్పట్లో చిరు లాగా అన్నీ దగ్గరుండి తన సినిమాని ఒక కన్న బిడ్డ లాగా చూసుకుంటున్నాడు అని అంటున్నారు చాలా మంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here