చైనా వ‌స్తువులు వ‌ద్దు.. ఆ ఒక్క‌టీ ముద్దు.. కేంద్రం వైఖ‌రి..

భార‌త్, చైనా మధ్య స‌త్సంబంధాలు తెగిపోయి కొన్ని నెల‌లు అవుతోంది. స‌రిహద్దులో ఇప్ప‌టికీ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణ‌మే కనిపిస్తోంది. ఎన్ని సార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా చైనా త‌న దురాక్ర‌మ‌ణ‌ను కొన‌సాగిస్తూనే ఉంది. ఈ ప‌రిస్థితుల్లో చైనాకు సంబంధించిన యాప్‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించిన విష‌యం తెలిసిందే. మొద‌ట కొన్ని యాప్‌లు, ఆ త‌ర్వాత మరికొన్ని యాప్‌లు బ్యాన్ చేసింది.

అయితే ఇండియాలో చైనాకు చెందిన విమానాలు కార్య‌క‌లాపాలు సాగిస్తున్నాయి. వీటిపై మాత్రం కేంద్రం ఎలాంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకోలేదు. ఏడు చైనా కంపెనీల‌కు చెందిన విమానాలు ఇండియాలో కార్య‌కాల‌పాలు సాగిస్తున్నాయి. ఈ కంపెనీల యాజ‌మాన్యాల‌న్నీ ఐర్లండ్‌లో న‌మోద‌య్యాయి. ఏడు చైనా కంపెనీల‌తో ఐర్లండ్‌తో ఒప్పందాలు ఉన్నాయి. ఈ విష‌యాన్ని పౌర‌విమాన‌యాన‌శాఖ ఇన్‌చార్జ్ మంత్రి హ‌ర్దీప్ సింగ్ చెప్పారు. చైనా కంపెనీల విమానాల లీజును ర‌ద్దు చేసే యోచ‌న లేద‌ని చెప్పారు.

వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ పార్ల‌మెంటులో దీనిపై ప్ర‌శ్నించ‌గా.. కేంద్ర మంత్రి స‌మాధాన‌మిస్తూ భార‌త్‌లో చైనా విమానాల కార్య‌క‌లాపాల‌ను ర‌ద్దు చేయ‌మ‌ని క్లారిటీ ఇచ్చారు. ఇక దేశ వ్యాప్తంగా అన్ని చైనా యాప్‌ల‌ను ర‌ద్దు చేసిన కేంద్రం.. చైనా విమానాల విషయంలో ఏ విధంగా ప్ర‌వ‌ర్తిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here