డిశ్చార్జ్ అయిన అమిత్‌షా ఏం చేస్తున్నారో తెలుసా..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎట్ట‌కేల‌కు హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయ‌న‌ క‌రోనా బారిన ప‌డిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఆరోగ్యంపై ఆందోళ‌న‌క‌ర‌మైన వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లు సార్లు అమిత్‌షా హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు.

అమిత్‌షాకు ఆగ‌ష్టు 2వ తేదీన క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవ్వ‌గా ఆ త‌ర్వాత ఆయ‌న కోలుకున్నారు. అయ‌తే మ‌ళ్లీ ఆయ‌న‌కు శ్వాసకోశ సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డంత ఆయ‌న ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. అప్పుడు రెండు వారాల పాటు హాస్పిట‌ల్‌లో ఉన్న ఆయ‌న ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. కాగా పార్ల‌మెంటు స‌మావేశాల‌కు రెండు రోజుల ముందు ఆయ‌న ఎయిమ్స్‌లో చేరారు.

పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో ఆయ‌న ఆరోగ్యంపై పూర్తి స్థాయి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎయిమ్స్ వ‌ర్గాలు తెలిపాయి. కాగా రెండు రోజులు ఆయ‌న హాస్పిట‌ల్‌లో ఉంటార‌ని ఎయిమ్స్ బృంధం తెల‌ప‌గా.. ఐదు రోజులు ఆయ‌న హాస్పిట‌ల్‌లోనే ఉన్నారు. ఆయ‌న పూర్తి ఆరోగ్యంగా ఉండ‌టంతో వైద్యులు ఆయ‌న్ను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన వెంట‌నే అమిత్‌షా బిజీబిజీగా ఉన్నారు. ప‌లు అభివృద్ధి ప‌నుల విష‌యంపై ఆయ‌న చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ సారైనా అమిత్‌షా పూర్తి స్థాయిలో కోలుకున్నారో లేదో అన్న ఆందోళ‌న ఆయ‌న అనుచ‌రుల్లో ఉంది. ఎందుకంటే ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఉన్నట్టుండి ఎయిమ్స్‌లో చేరుతున్న తీరుతో ఒకింత ఆందోళ‌న నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here