యువతలో స్ఫూర్తి నింపుతున్న బిగ్ బి..

బిగ్ బి అమితాబ్ బచ్చన్ జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఒకప్పుడు తన గొంతు బాలేదంటూ తిరస్కరణకు గురైన వ్యక్తి.. బాలీవుడ్ లోనే అగ్ర హీరోగా ఎదిగారు. 70 ఏళ్ల వయసులోనూ యాక్టివ్ గా ఉంటూ.. సినిమాలు, రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక అమితాబచ్చన్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే… అయితే కొద్ది సమయంలోనే కరోనాను జయించి అందరినీ ఆశ్చర్య పరిచారు బిగ్ బి.

ఇక కరోనా నుంచి కోలుకున్న కొన్ని రోజుల్లోనే తన పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి షోతో బిజీగా మారారు. ఈ నేపథ్యంలోనే తన బ్లాగ్ ద్వారా యువతకు ఒక మంచి సందేశాన్నిచ్చారు బిగ్ బీ. ‘నేను విభిన్న రకాల పనులు చేస్తున్నాను. కొన్నిసార్లు రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నాను. ఈమధ్యే చిత్రీకరణను తిరిగి ప్రారంభించాను. ఇంకా చేయాల్సిన ఎపిసోడ్లు చాలా ఉన్నాయి. మీ అందరి ప్రేమ, అభిమానం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెల్లవారుజామునే సెట్ కు వెళ్తున్నాను. ప్రపంచంలో పోటీ బాగా పెరిగిపోయింది. ఇప్పటికీ నేను రోజులో 12 నుంచి 14 గంటల పని చేస్తున్నాను. ‘మనిషి అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదనే’ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ప్రతి నిమిషం కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి’అంటూ యువతలో  స్ఫూర్తి నింపే వ్యాఖ్యలు చేశారు అమితాబ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here