‘కన్నడలో మాట్లాడడం కాదు .. అలా చేస్తే సినిమా విడుదల చేయనిస్తాం’

బాహుబలి 2 సినిమాని అడ్డుకోవడం సరికాదు అంటూ సత్యరాజ్ ని వెనకేసుకుని వచ్చి తమ సినిమాని కన్నడనాట విడుదల చెయ్యమని అడుగుతున్నా రాజమౌళి కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ మధ్యన రాజమౌళి కన్నడం లో మాట్లాడుతూ విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనాలు రేపుతోంది. కన్నడ లో విడుదల చేసిన ఈ వీడియో మీద కన్నడ పార్టీ నాయకుడు నాగరాజు సప్న్దించారు. ” సత్యరాజ్ క్షమాపణలు చెప్పేవరకూ బాహుబలి విడుదల మేము ఒప్పుకోము.

ఇది ఒత్తి బాహుబలి 2 మీద మాత్రమే కాదు అతను నటించిన అన్ని సినిమాల మీదా ఈ ప్రభావం ఉంటుంది. రాజమౌళి కన్నడలో మాట్లాడినంతమాత్రాన సరిపోదు. మీ వల్ల అయితే కట్టప్ప తో సారీ చెప్పించండి .. ” అన్నారు నాగరాజు. ఈ విషయంలో సాక్షాత్తూ బ్రహ్మదేవుడే వచ్చినా తమ నిర్ణయం మారదని ఆయన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here