మహేష్ తో ఆమె రోమాన్స్ అనగానే అందరూ వెతికేస్తున్నారు

నిన్న మొన్నటి వరకూ మన తెలుగువారికి కీయరా అద్వానీ అనే పేరు తెలీనే తెలీదు. బాలీవుడ్ లో ఆ పేరుతో ఒక హీరోయిన్ ఉన్నట్టు తెలుగు మీడియా కి గానీ తెలుగు ప్రేక్షకులకి కానీ అస్సలు తెలీదు. కానీ ఒక్కసారిగా మహేష్ బాబు సరసన కీయరా నటిస్తోంది అనే వార్తలు బయటకి రావడం తో ఆమెకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చి పడింది. ఆమె ఎవరు అనేది తెలుసుకోవడం కోసం మహేష్ ఫాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ జనాలు సైతం ఇంటర్నెట్ లో ఆమె గురించి వెతకడం మొదలు పెట్టారు. గూగుల్ ట్రెండ్స్ లో కీయరా పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
 కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ చెయ్యబోతున్న భరత్ అను నేను అనే చిత్రం కోసం ఆమె మహేష్ పక్కన రోమాన్స్ చెయ్యబోతోంది అన్న ఒకే ఒక్క రూమర్ ఇంత సెర్చ్ కి దారి తీసింది. మహేష్ హీరోయిన్ కి ఎంత డిమాండ్ చూసారా. ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో హీరోయిన్ల కొరత బాగా వుంది. దీంతో కొత్తగా ఏ హీరోయిన్‌ వచ్చినా కానీ పెద్ద హీరోల చిత్రాలకే తీసేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here