పర్ఫెక్షన్ కోసం నివేదా ఎలా ప్రాక్టీస్ చేస్తోందో చూడండి.!

అందం, అభినయంతో ఆకట్టుకునే హీరోయిన్లలో నటి నివేదా థామస్ ఒకరు. తనదైన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులు ఆకట్టుకుంటుందీ చిన్నది. కేవలం నటనతోనే కాకుండా డ్యాన్స్ లోనూ మంచి ప్రతిభను కనబరుస్తుందీ బ్యూటీ. నివేదా డ్యాన్స్ లో పర్ఫెక్షన్ సాధించడానికి ఎంతలా కృషి చేస్తుందో తెలిపే వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది.

నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇటీవల ‘వి’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన కొన్ని  వీడియోలను నివేదా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ వీడియోలతో పాటు

‘పురోగతి కోసం సాధన’ అనే క్యాప్షన్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోలపై మీరూ ఓ కన్నేయండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here