మోదీ బయోపిక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

చాయ్ వాలా స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం. బీజేపీ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి దేశ ప్రధాని స్థానానికి చేరుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. మోదీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.. ఒక పర్ఫెక్ట్ బయోపిక్ కు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండిఅందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ‘మనో విరాగిపేరుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నుమోదీ పుట్టినరోజు సందర్భంగా గురువారం విడుదల చేశారు. మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రయూనిట్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఎస్. సంజయ్ త్రిపాఠీ రచన, దర్శకత్వంలో మహావీర్ జైన్తో కలిసి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేంద్ర మోదీ పాత్రలో అభయ వర్మ నటిస్తున్నాడు. ఇక చిత్రాన్ని గుజరాత్లోని వాద్ నగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రదేశాలలో చిత్రీకరణ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here