ఆ కథల్లో నటించడానికైనా సిద్ధమే..

అందం, అభినయం ఉన్న నటీమణుల్లో నివేదా థామస్ ఒకరు. తన క్యూట్ నటన, అందమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందీ కేరళ కుట్టి. నాని హీరోగా నటించిన జెంటిల్‌మెన్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటివరకు కేవలం నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్న నివేదా.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది.
గ్లామర్ పాత్రలపై మీ ఆలోచన ఎలా ఉంటుందని ఇటీవల అడిగిన ఓ ప్రశ్నకు నివేతా సమాధానమిస్తూ.. ‘కేవలం ఒక గ్లామర్ పాత్రలనే కాదు.. నేను ఎంచుకున్న ఏ కథలోనైనా, నేను మొదటగా ఆలోచించేది.. కథ వింటున్నప్పుడే నాకు ఆ సినిమా చేయాలనిపించాలి. ఇక గ్లామర్ పాత్రలంటారా.. కావాలని గ్లామర్ షో కు దిగను, ఎందుకంటే కొంత కాలం తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేను ఫలానా చిత్రంలో నటించానని గర్వంగా చెప్పుకోగలగాలి. దాని ఆధారంగానే నా పాత్రల ఎంపికలు ఉంటాయి. నటిగా నాకు మంచి పేరు వస్తుంది అంటే హారర్ చిత్రాల్లో కూడా నటించడానికి సిద్ధమే’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here