నాది చిన్న పిల్లల మనస్తత్వం…

‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నటి నివేదా పేతురాజ్. అనంతరం బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురములో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలుగా మారిందీ చెన్నై బ్యూటీ. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తోందీ భామ. ఇక ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రెడ్’ సినిమాలో నటిస్తోన్న నివేదా…  చిత్ర షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ కు వచ్చింది. నిజానికి ఈ పాటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

‘రెడ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నివేదా..  తన వ్యక్తిత్వానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా నివేదా మాట్లాడుతూ.. ‘ నాది చిన్న పిల్లల మనస్తత్వం. పిల్లలు కొత్తగా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా, కొత్త వ్యక్తులను కలిసినా కొద్దిసేపటిపాటు..  సైలెంట్ గా ఉంటారు. అలవాటైతే మాత్రం ఇక వారి అల్లరిని ఎవరూ  ఆపలేరు..  నేను కూడా అంతే. ముందు కాస్త బిడియంగా ఉంటా,  కొంచెం అలవాటైతే మాత్రం నన్ను ఎవరూ ఆపలేరు. సినిమా సెట్ లోనూ కూడా అంతే.. కొంచెం సేపు సైలెంట్ గా ఉంటా ఇక ఆ తర్వాత అస్సలు ఆగను. సినిమా సెట్ లో అందరితో బాగా కలిసి పోయినప్పుడే.. సన్నివేశాలు బాగా వస్తాయి. ఆ ప్రభావం నటనలో కచ్చితంగా కనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here