ఏంటి నా గురించి అలా చెప్పుకుంటున్నారా ? – షాక్ అయిన నిత్యా మీనన్ !

హీరోయిన్ గా కంటే కూడా గ్లామర్ క్వీన్ లుగా హీరోయిన్ లు రాజ్యం ఏలుతున్న ఈ కాలం లో నిత్యా మీనన్ తన స్టైల్ వేరు అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆమెకి సంబందించిన ఒక వార్త న్యూస్ లో బాగా కనిపిస్తోంది. . ఛాన్స్ ల విషయం లో ఇతర హీరోయిన్ లతో పోల్చుకుంటే నిత్య వెనక పడింది అనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అనేక వార్తలు రూమర్స్ వెల్లువలా వస్తున్నాయి. నిత్యామీనన్ కు నటనపై ఆసక్తి తగ్గిందని, దర్శకత్వంపై ఆమెకు మోజు పుట్టిందని, అందుకే నటిగా అవకాశాలను కూడా తిరస్కరిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ఇదే ప్రచారం గురించి ఒక మీడియా హౌస్ వారు అడిగిన ప్రశ్న కి నిత్య సమాధానం చెబుతూ .. ” ఇలాంటి ప్రచారాలు కూడా సాగుతున్నాయా ? నేనెప్పుడూ డైరెక్షన్ చేస్తా అనే చెప్పలేదే. ఆసక్తికర పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను అంతే.” ఏదేమైనప్పటికీ తనను దర్శకురాలిగా చూడాలని చాలా మంది ఎదురుచూస్తుండటం… తనకు సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here