లోకేష్ వారు.. మళ్లీ నవ్వించేశారే!

‘వినాలి.. మీరు వినాలి’ అంటూ ఓసారి… ‘విద్యార్థి విభాగం మీరు తప్పకుండా వినాలి’ అంటూ ఇంకోసారి.. ‘ఒక్క ఐదు నిముషాలు ఇవ్వండి ప్లీజ్’ అంటూ మరోసారి… ‘జగన్ మోహన్ రెడ్డి అన్న ఎంత అడ్డం పొడుకున్నా సరే.. అభివృద్ధిని అడ్డుకోలేరు’ అంటూ మళ్లీ ఓ సారి. ఇలా పదే పదే నవ్వించేస్తూ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యులు, ముఖ్యమంత్రి తనయులు అయిన లోకేష్ బాబుల వారు.. మహానాడులో ప్రసంగాన్ని కొనసాగించేశారు.

ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు తలవనిదే ఎక్కడా ప్రసంగించలేరు అనిపించేంతగా.. ఆయన పేరునే మళ్లీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అది కూడా.. అలవాటులో పొరపాటుగానో.. పొరపాటే అలవాటుగానో.. ‘జగన్ మోహన్ రెడ్డి అన్న’ అని ఓసారి.. ‘జగన్ మోహన్ రెడ్డి’ గారు అని మరోసారి.. రెండు రకాలుగా పేరును పలికారు. ఆయన మంత్రముగ్ధమైన ప్రసంగాన్ని చూసి.. తండ్రి చంద్రబాబు కూడా పుత్రోత్సాహంతో మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు.

ఆయన మాటల ధాటి వైభవాన్ని చూసి.. కిందనున్న కార్యకర్తలు ఈలలు వేస్తూ.. నవ్వుకున్నారు. మంత్రిగారి మాటలు.. కుదిరితే కాబోయే ముఖ్యమంత్రి అయిన లోకేష్ వారి ప్రసంగపు ఛలోక్తులు వింటూ.. స్టేజ్ పైన ఉన్న నేతలు కూడా.. మా గొప్ప నాయకుడు అంటూ.. హాయిగా నవ్వుతూ రిలాక్స్ అయ్యారు. మొత్తానికి ఓ విషయం మాత్రం నిజం. చంద్రబాబు తర్వాత.. టీడీపీకి అంతటి నాయకుడిగా మారుతున్న లోకేష్ బాబు.. తన ప్రసంగంతో.. పార్టీలో.. కార్యకర్తల్లో ఎంత ఉత్తేజం నింపారో తెలియదు కానీ.. రెండు రోజులుగా.. మహానాడుతో అలసి సొలసిన పార్టీ ప్రపంచానికి.. పనిలో పనిగా లైవ్ లో టీవీల్లో చూసిన జనానికి తన అస్పష్టమైన పలుకులతో.. మాంచి రిలాగ్జేషన్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here