రాశీఖన్నా తో నితిన్

రాశీఖన్నా తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తాజాగా ఈ అమ్మడు తొలిప్రేమ సినిమా తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గట్టి హిట్టు కొట్టింది. ప్రస్తుతం తొలిప్రేమ రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన నటించిన రాశీఖన్నా తెలుగు ప్రేక్షక హృదయాలను మరొకసారి దోచుకుంది ఈ హాట్ బ్యూటీ. ఈ క్రమంలో రాశీఖన్నా మరొక తెలుగు ప్రముఖ యంగ్ హీరోతో జతకడతాకి  సిద్ధమైపోయింది.
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకు రాశీఖన్నా ను హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమా టైటిల్ ‘శ్రీనివాస కల్యాణం’ అంతేకాకుండా ఈసినిమాలో మరొక హీరోయిన్ గా వేరొక అమ్మాయిని వెతుకులాటలో ఉన్నారు సినిమా యూనిట్. నితిన్ ప్రస్తుతం చల్ మోహన్ రంగ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు…. ఈ సినిమా పూర్తవ్వగానే దిల్ రాజు  నిర్మించబోయే శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు నితిన్.  ఇండస్ట్రీలో వరుస విజయాలతో ఉన్న హీరోయిన్ రాశీఖన్నా నితిన్ సినిమాతో  కూడా మరోసారి హిట్ కొడుతుంది అంటున్నారు సినిమా విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here