రామ్ చరణ్ రంగస్థలం విశేషాలు

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరన్ హీరోగా  సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘రంగస్థలం’ తాజాగా విడుదలైన ఈ సినిమా హీరో హీరోయిన్ టిజర్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పల్లెటూరు అందాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని అంటున్నారు సినిమా యూనిట్.గోదావరిలో పడవ నడిపే చిట్టిబాబుగా చరణ్ నటిస్తుండగా, రామలక్ష్మి అనే పేదింటి పిల్లగా సమంత నటిస్తోంది.
ప్రేమకథతో పాటు రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో 1985 నాటి రాజకీయాలు .. అవి చూపే ప్రభావాలు కథలో భాగంగా వస్తాయని అంటున్నారు. మండల స్థాయిలో జరిగే ఎన్నికలకి సంబంధించిన సన్నివేశాలు ఉత్కంఠను రేపేవిగా వుంటాయని చెబుతున్నారు. తాజాగా సినిమాకి సంబంధించి విడుదలైన టిజర్స్ సోషల్ మీడియా లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. మార్చి 30న ఈ సినిమాను విడుదల చేయడాన్ని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమా మీద మెగాభిమానులకు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here