థియేటరే మా తొలి ప్రాధాన్యం… కానీ కుదరట్లేదు!

కోవిడ్ 19 నిబంధనలో భాగంగా సినిమా థియేటర్లు  దాదాపుగా గత ఆరు నెలల నుంచి మూతపడ్డ విషయం తెలిసిందే. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్నదానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో కొందరు దర్శక, నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా విడుదల చేస్తున్నారు. ఇక అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న నిశ్శబ్దం చిత్రం కూడా కరోనా కారణంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే ఏకంగా రెండేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న సినిమా, అందులోనూ భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతోనిర్మాతలు నష్టపోయే పరిస్థితులు వచ్చాయి. దీంతో చిత్రాన్ని ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.

అయితే విషయమై చిత్ర యూనిట్ తొలిసారి అధికారికంగా స్పందించింది. విషయమై చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ మాట్లాడుతూ..’ నిశ్శబ్దం చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే విడుదల చేయనున్నాము. థియేటర్స్ లో విడుదల చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా, పరిస్థితులు మా చేతుల్లో లేవు, థియేటర్లు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో తెలియదు. అందుకే చిత్రాన్ని ఆన్ లైన్ లోనే విడుదల చేయడానికి సిద్ధమయ్యాముఅని చెప్పుకొచ్చాడు. ఇక చిత్ర నిర్మాత కోనవెంకట్ విషయమై మాట్లాడుతూ..’ నిజానికి చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడమే మా తొలి ప్రాధాన్యం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను ఎక్కువ రోజులు వాయిదా వేయలేం, రెండేళ్లకు పైగా కష్టపడి చేసిన ప్రాజెక్టును ఇలా విడుదల చేయడం నిజంగానే బాధగా ఉందని  చెప్పుకొచ్చారు. ఇక చిత్రాన్ని అక్టోబర్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో.. మాధవన్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here