టీటీడీ సీటు విషయం లో ట్విస్ట్ !

టీటీడీ పాలకమండలి చైర్మన్ పదవి  గత ఏడాది మే నెల నుండి ఖాళీగా ఉంది. అప్పటినుండి రాష్ట్ర ప్రభుత్వం అదిగో ఇదిగో నియామ‌కాలు అంటూనే కాల‌యాప చేస్తూ వ‌చ్చారు. ఈ అంశం తెర‌మీదికి వ‌చ్చిన ప్ర‌తీసారీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం కొంత‌మంది పేర్లు తెర‌మీదికి రావ‌డం ప‌రిపాటి అయిపోయింది. అయితే ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా  విలేకరులు టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి కట్టబెడతారని ప్రస్తావనకు రావడం గమనార్హం ఈ క్రమంలో పట్టా సుధాకర్ యాదవ్  పేరు వచ్చాయి కదా అని మీడియాప్రశ్నించగా ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చారు.

ఎందుకంటే పుట్టా సుధాకర్ యాదవ్ ఈమధ్య క్రైస్తవ మహాసభల లో పాల్గొనడం జరిగింది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం ఒకవేళ పుట్టా సుధాకర్ యాదవ్ కు పదవి కట్టబెడితే మాత్రం బిజెపి రాష్ట్ర మంత్రుల లో  ఒకరి తో  రాజీనామా చేపించాలని ఉద్దేశ్యంతో ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారట.దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్ప‌టికే దేవ‌స్థానంలో ప‌నిచేస్తున్న అన్య మ‌త‌స్థుల సంఖ్య ఎక్కువ‌వౌతోంద‌నీ ఆర్‌.ఎస్‌.ఎస్‌.అంటుంది.అయితే బిజెపి కి సంబంధించిన మంత్రి మాణిక్యాలరావు ను టీటీడీ చైర్మన్ గా కూడా నియమించాలని లేదా బిజెపి కి సంబంధించిన నాయకుని మాత్రమే నియమించాలని ఆర్‌.ఎస్‌.ఎస్‌. రాష్ట్ర ప్రభుత్వం మీద  ఒత్తిడి చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here