సుశాంత్ కేసులో ఊహించని మలుపు..ఆధారాలతో కూడిన మినిస్టర్ సుబ్రమనియన్ పోస్ట్

గత నెల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎంత కలిచివేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇది ఆత్మహత్య అనే కన్నా ఖచ్చితంగా హత్యే అనడానికి పలు బలమైన కారణాలు ఉన్నాయని అందుకు కారణమైన ప్రతీ ఒక్కరిని శిక్షించాలని సుశాంత్ అభిమానులు ఎప్పటి నుంచో గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ కేసును సీబీఐ వారు ఓవర్ టేక్ చేసిన అనంతరం ఊహించని విధమైన మలుపులు తిరుగుతుంది. తాజాగా జాతీయ పార్టీ బీజేపీకి చెందిన ఎంపీ మరియు యూనియన్ కాబినెట్ మినిస్టర్ సుబ్రమనియన్ స్వామి పెట్టిన ఓ ఆధారిత పోస్ట్ సంచలనంగా మారింది.

ఇందులో ఓ పేపర్ స్టేట్మెంట్ ద్వారా సుశాంత్ కు జరిగిన ఈ ఉదంతం ఆత్మహత్య అనే దానికంటే హత్యే అయ్యేందుకు అవకాశాలు ఉన్నట్టుగా చాలా పాయింట్స్ చెప్తున్నాయి. సుశాంత్ సింగ్ తన సిమ్స్ మార్చడం దగ్గర నుంచి అతని మెడపై ఉన్న తాడు మచ్చలు ఫ్యాన్ కేమో గుడ్డ కట్టి ఉండటం, డూప్లికేట్ కీ మిస్సవ్వడం ఇలా చాలా సందేహాలు లిఖితపూర్వకంగా ఇది క్లియర్ కట్ మర్డర్ అనేందుకు తావిస్తున్నాయి. మరి ఈ కేసులో ఏంజరగబోతుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here