మాట నిలబెట్టుకున్నకేటీఆర్..ఆరోగ్య శాఖకు అందిన వాహనాలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఆరోగ్యశాఖకు ఆరు అంబులెన్స్ వాహనాలను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కేటీర్ ప్రకటించిన తరువాత మొన్న మిగతా మంత్రులు కూడా తమ వంతు సహాయంగా కొన్ని అంబులెన్సులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రకటించినట్టుగానే ఆరోగ్య శాఖకు ఆ వాహనాలు అందచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

కేటీఆర్ ఆరు కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్‌ను ఆరోగ్యశాఖకు అందించారు. అయితే ఈ ఆరు వాహనాలను ఆరోగ్యశాఖ మొదట కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్‌గా వాడుకోనుందని, ఆ తరువాత వాటిని సాధారణ అంబులెన్స్‌లుగా వినియోగిస్తుందని చెబుతూ వాటిని ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టిన కేటీర్ ని, కేటీర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి తమవంతు సాయం చేసిన మంత్రులను  అభినందించాల్సిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here