భవిష్యత్ భారతానికి భరోసాగా కొత్త విద్యావిధానం అమలు..

తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం ప్రకటించింది. గత 34 ఏళ్లగా మన దేశంలో ఒకే విధానం అమలులో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా విధానంలో కొన్ని మార్పులు చేసి క్రొత్త విద్యని అమలులోకి తేబోతుంది. మామూలుగా అయితే ఈ విద్యా సంవత్సరం ఈ పాటికి ప్రారంభమై ఉండేది. కానీ కరోనా కారణంగా ఇంకా విద్యాసంవత్సరం ప్రారంభం కాలేదు కాబట్టి అమలు చేయడానికి కేంద్రానికి అవకాశం చిక్కింది

విద్యావిధానంలో మార్పులు ఇలా ఉండబోతున్నాయి: ఇప్పటి వరకూ పదో తరగతి వరకు ఓ అంకం, తర్వాత రెండేళ్ల ఇంటర్,తర్వాత మూడేళ్ల డిగ్రీ విధానం ఉండేది. దీన్ని 10 + 2 + 3 గా పేర్కొంటూ వస్తున్నారు. ఇప్పుడు కేంద్రం 5 + 3 + 3 + 4 గా మార్చేసింది. మూడేళ్ల నుంచి పిల్లలను ప్లే స్కూల్‌కు పంపొచ్చు. 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు ప్రిపరేటరీ, 11-14 ఏళ్ల వారు మిడిల్‌, 14-18 ఏళ్లవారు సెకెండరీ స్కూల్‌ విద్యను పొందుతారు. ఇందులో ఇంటర్మీడియట్‌కు చోటు లేదు. స్కూల్ విద్యలోనే దీన్ని కలిపేశారు. పరీక్షలకూ ప్రాధాన్యం తగ్గించేశారు. ఏటా ఒకసారి కాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. బట్టి పట్టడం వల్ల వచ్చే మార్కులను కాకుండా ప్రాక్టీకల్ మార్కులను కలిపి గ్రేడింగ్ చేస్తారు.

చదువుకునే విధానంలోనే కాదు..సబ్జెక్టుల్లోనూ మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు సైన్స్‌ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేస్తున్నారు. ప్రాధమిక విద్య పూర్తిచేసుకొని బయటికెళ్లేనాటికి కనీసం ఒక వృత్తి విద్యా నైపుణ్యమైనా విద్యార్థి సాధించేలా ఉంటుందని అంటున్నారు. ఉద్యోగాలకు వెళ్లాలనుకున్న వారికి మూడేళ్ల డిగ్రీ, పరిశోధన రంగం వైపు వెళ్లాలనుకున్నవారికి నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాం అమలు చేయనున్నారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి ఓ ఏడాది పీజీ కోర్సు ఉంటుంది.

కేంద్రం ప్రకటించిన ఈ విధానం అందరికీ విద్య.. అందుబాటులో విద్య.. విద్యతో పాటు బతకడానికి కావాల్సిన నైపుణ్యం పెంచుకోవడం అనే కాన్సెప్ట్‌తో రూపొందిందని అనుకోవచ్చు. కేంద్రం తెచ్చిన ఈ విద్యావిధానం మారుతున్న కాలానికి అనుగుణంగానే ఉంది. ఈ జాతీయ విద్యా విధానాన్ని పక్కాగా అమలు చేస్తేనే భవిష్యత్ భారతానికి భరోసాగానే అంటుంది. ఏదేమైనా మన దేశంలో 34 సంవత్సరాల తరువాత ఒక నూతన విధానానికి బీజం ఈ కొత్త విద్యా విధానం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here